Shriya Reddy: పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి ....! 2 d ago
ససలార్' తో గతేడాది ప్రేక్షకులను అలరించారు నటి శ్రీయా రెడ్డి. ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'ఓజీ' కోసం వర్క్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయా రెడ్డి, తాను నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ 'ఓజీ' గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చివర్లో విడుదలైన 'సలార్ - సీజ్ ఫైర్' లో నా పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో రానున్న బిగ్గెస్ట్ మూవీల్లో ఒకటైన 'ఓజీ' లో వర్క్ చేశా. ఇందులో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. "పవన్కల్యాణ్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశా. ఆయన చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి. ఎంతో హుందాగా ఉంటారు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఎదుటి వ్యక్తులతో ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చూడచక్కగా ఉంటుంది” అని ఆమె చెప్పారు.